కరోనా బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం

కరోనా బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం

క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని.. తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు తెలిపారు ఏపీ సీఎం జ‌గ‌న్. అలాగే వారు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న ట్రీట్ మెంట్ సహా.. ఇతర అంశాలపై సీఎం జగన్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం మరోసారి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఎలాంటి ఆటకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి బాధితుడికి రోజూ భోజనం, వసతి లాంటి అవసరాల కోసం రూ. 500కు తక్కువ కాకుండా కేటాయించాలని సూచించారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్నారు సీఎం జ‌గ‌న్.