15 వ ఆర్థిక సంఘం ఫండ్స్ జమ..యాదాద్రి జిల్లాకు  రూ. 7.59 కోట్లు

15 వ ఆర్థిక సంఘం ఫండ్స్ జమ..యాదాద్రి జిల్లాకు  రూ. 7.59 కోట్లు

యాదాద్రి, వెలుగు: పంచాయతీ ఎన్నికలు జరగడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేశాయి. పంచాయతీల అకౌంట్లలో 2024-–25  ఫైనాన్స్​ ఇయర్​కు సంబంధించిన15వ ఆర్ధిక సంఘం ఫండ్స్​ జమయ్యాయి.  యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 427 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం రూ. 7.59 కోట్లు రిలీజ్​ చేసింది. అన్​టైడ్​ కింద వచ్చిన ఈ అమౌంట్​లో 10 శాతం పరిపాలన ఖర్చుల కేటాయింపులు చేసుకోవాల్సి ఉంటుంది.

మిగిలిన అమౌంట్​ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)లో భాగంగా చేపట్టిన పనుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అత్యధికంగా వలిగొండ మండలానికి రూ. 70.85 లక్షలు, రామన్నపేటకు రూ. 62.32  లక్షలు, బీబీనగర్​కు రూ. 60.80 లక్షల చొప్పున జమ అయ్యాయి. అతి తక్కువగా మోత్కూరు మండలానికి రూ. 17.20 లక్షలు జమ అయ్యాయి.