ఫార్మా కంపెనీలో మంటలు..యాదాద్రి జిల్లా ధోతిగూడెంలో ఘటన

ఫార్మా కంపెనీలో మంటలు..యాదాద్రి జిల్లా ధోతిగూడెంలో ఘటన
  • యువకుడు సజీవదహనం

భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లి, వెలుగు : ఫార్మా కంపెనీలో మంటల చెలరేగడంతో ఓ యువకుడు సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌‌‌‌‌‌‌‌పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని వీజే సాయి ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం మధ్యాహ్నం కంపెనీలోని బీ బ్లాక్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న కెమిస్ట్‌‌‌‌‌‌‌‌ సాయి (32)... డ్రమ్ములో ఉన్న కెమికల్‌‌‌‌‌‌‌‌ను రియాక్టర్‌‌‌‌‌‌‌‌లోకి పంపింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో కెమికల్‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌‌‌‌‌ కావడంతో డ్రమ్ము పేలి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

అయితే లంచ్‌‌‌‌‌‌‌‌ టైం కావడంతో కార్మికులంతా బయటే ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కంపెనీ యాజమాన్యం చెప్పింది. ఫైర్‌‌‌‌‌‌‌‌ ఇంజిన్లు వచ్చి మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. విషయం తెలుసుకున్న చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ ఏసీపీ మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని బ్లాక్‌‌‌‌‌‌‌‌లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో సాయికి మంటలు అంటుకోవడం, అతడు పరిగెడుతున్న దృశ్యాలు కనిపించడంతో అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.