ఏపీలో టైలర్లకు రూ. 10 వేలు విడుదల

ఏపీలో టైలర్లకు రూ. 10 వేలు విడుదల

టైలర్లతో పాటు నాయిూ బ్రాహ్మణులు, రజకులకు కూడా..

‘జగనన్న చేదోడు’ ప్రారంభం

పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ‘జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తోంది. తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న వారికోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తెలిపారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తానని జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన అన్నారు.

For More News..

వైరల్ ఆడియో: గాంధీలో అన్నీ ఇస్తున్నామన్న కేసీఆర్.. ఇప్పుడేమంటారో?

విజయవాడలో మళ్లీ లాక్డౌన్

సెకెండ్ హ్యాండ్‌ కార్లకు ఫుల్​ గిరాకీ

మరో పది రోజుల్లో టెన్త్ రిజల్ట్స్