నా ప్రతి అడుగులో నాన్న తోడుంది: వైఎస్ జగన్

నా ప్రతి అడుగులో నాన్న తోడుంది: వైఎస్ జగన్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన పేరు తెలియని తెలుగు మనిషి ఉండడు. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఆయన సుపరిచితుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులే.. ఆయన చనిపోయి 11 ఏళ్లయినా ఇంకా గుర్తుపెట్టుకునేలా చేశాయి. ప్రతి గడప ఆయన పెట్టిన ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొంది ఉంటుంది. అందుకే ఆయన మహానేత అయ్యాడు. నేడు ఆయన వర్ధంతి. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఆయన జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకుంటూ.. ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు.

‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

For More News..

ఆహార సంక్షోభంలో చిక్కుకున్న చైనా!

బీఈడీ కోర్సుల ఫీజ్ పెంచిన ప్రభుత్వం

సెక్రటేరియట్ చెట్ల తరలింపుకు 5 కోట్లు