డిప్యూటీ సీఎం ఓటు గల్లంతు.. ఓటు వేయకుండానే బయటకు

డిప్యూటీ సీఎం ఓటు గల్లంతు.. ఓటు వేయకుండానే బయటకు

ఏపీలో మున్పిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు, నాయకులు, వివిధ పార్టీల నేతలు తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే తన ఓటు వేయడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం ఆళ్లనానికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఏలూరు కార్పొరేషన్‌లోని 25వ డివిజన్‌లో ఓటు వేయడానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన నానికి ఓటర్ లిస్టులో ఓటు హక్కు గల్లంతైనట్లు తెలిసింది. దాంతో ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,214 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది.