మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ కళ్యాణ్ భేటీ... తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై చర్చ..

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తో పవన్ కళ్యాణ్ భేటీ... తూర్పు కనుమల్లో పులుల సంరక్షణపై చర్చ..

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళవారం ( జూన్ 30 ) జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని మహారాష్ట్ర సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతలు చర్చినట్లు సమాచారం. .

ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు ఇరువురు నేతలు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... పాలోని తూర్పు కనుమల ప్రాంతాల్లో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తెలెత్తాయని.. ఈ క్రమంలో పులుల పునరుద్దరణకు మహారాష్ట్ర సీఎం సహకారం తీసుకుంటున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీకి రెండు ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని..వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.

తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని ... తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని... తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు పవన్ కళ్యాణ్.