ఓటు హక్కు కోసం స్వగ్రామానికి ఏపీ ఎన్నికల కమిషనర్

ఓటు హక్కు కోసం స్వగ్రామానికి ఏపీ ఎన్నికల కమిషనర్

గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించిన ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ తన సొంత గ్రామానికి వచ్చారు. దుగ్గిరాలలోని స్వగ్రామానికి వచ్చారు. తన సొంతూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న నిమ్మగడ్డకు స్థానిక అధికారులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రామంలో నివాసం ఉండడం లేదంటూ ఓటు కల్పించేందుకు నిరాకరించారు. దీనిపై అప్పీల్ చేసుకున్న నిమ్మగడ్డ.. తన గ్రామంలోని సొంతింటికి వచ్చి ఎమ్మార్వోకు చూపించాలని నిర్ణయించారు. ఆదివారం సొంత గ్రామానికి వచ్చిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు దుగ్గిరాల తహాశీల్దార్ మల్లేశ్వరి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం పట్టుకుని మరీ వచ్చి తన కోసం వచ్చిన తాహశీల్దార్ ను చూసి పుష్పగుచ్చం తీసుకునేందుకు కొద్దిగా తటాపటాయించినా సందేహంగా చూడడంతో తీసుకున్నారు. ఈ సందర్భంగా తహాశీల్దార్‌ మల్లీశ్వరిని ఉద్దేశించి నిమ్మగడ్డ మాట్లాడుతూ ‘‘నేనే మీ ఆఫీస్‌కు వద్దామనుకున్నాను. నీవే వచ్చావా? ఇదే మా ఇల్లు చూడండి’’ అంటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామంలో నివాసం ఉండడం లేదని తిరస్కరించిన దరఖాస్తుకు సంబంధించిన అప్పీలు తన వద్దకు వచ్చిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి దినేశ్‌కుమార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తన ఇంటిని చూపించడంతోపాటు.. బంధువులు, స్నేహితులతో తాహశీల్దార్ కు తెలియజేశారు. సుమారు గంటన్నరకుపైగా సొంతింట్లో బంధు మిత్రులు, పెద్దలతో రమేష్ కుమార్ మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరును ఆరా తీశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ స్పందించి రమేష్ కుమార్ కు ఓటు హక్కు కల్పించే విషయంపై  కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్లు

అదుపుతప్పి చెరువులో పడిన ఎద్దుల బండి.. తాతా మనవడి మృతి

లారీ నిండా పండ్ల బుట్టలు.. తేడా కనిపిస్తోందని చెక్ చేస్తే..

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే