జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో జరిగిన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.విభజన కారణంగా రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించిన ఆయన పలు కీలక అంశాలు లేవనెత్తారు.ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సహాయం అందించాలని కోరారు పయ్యావుల.అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సహాయం అందించాలని కోరామని,వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయంతో పాటు పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని కోరామన్నారు.

మెగా రోడ్ నెట్వర్క్ ప్రాజెక్టులతో పాటు ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటుతో పాటు  గ్రీన్ ఎనర్జీ కారిడార్ కి మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.తిరుపతి, వైజాగ్ విమానాశ్రయాల కోసం చేపట్టిన భూసేకరణ విషయంలో కేంద్రం నుంచి రావాల్సినది ఇంకా ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.రామాయపట్నం పోర్టు, క్రూడ్ ఆయిల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విభజన హామీలు అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం నిధులు కావాలని కోరామన్నారు.

ఇవన్నీ బడ్జెట్ లో వెంటనే వచేస్తాయని కాదు. కానీ రాష్ట్ర అవసరాలు ఏంటి అన్నది సమయానుకూలంగా చెబుతూ, కేంద్రం నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హ్యాండ్లూమ్ పరిశ్రమపై పన్ను రేటు తగ్గించాలని కోరినట్లు తెలిపారు.