ఏపీలో గోల్డ్ మైన్స్ షురూ..జొన్నగిరిలో రూ. 405 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఏపీలో గోల్డ్ మైన్స్ షురూ..జొన్నగిరిలో రూ. 405 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • తొలి దశలో 400 కేజీలు, 
  • తర్వాత 900 కేజీలు, చివరికి 
  • 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం
  • జొన్నగిరి రాయలసీమకు ‘స్వర్ణగిరి’గా మారుతుందని కామెంట్​
  • జోన్నగిరిలో రూ.405 కోట్ల ప్రాజెక్టు
  •     తొలి దశలో 400 కేజీలు, తరువాత 900 కేజీలు, చివరికి 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని జోన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్‌‌‌‌లో గోల్డ్ మైన్స్ ప్రారంభమయ్యాయి. బుధవారం ఈ ప్రాజెక్టు ను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రారం భించారు. జోన్నగిరి ఇకపై ‘స్వర్ణగిరి’గా మారుతుంద ని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. రాయలసీమ అభివృద్ధికి కీలక మలుపు అవుతుందన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. 

ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన కూడా చేశారు. జియో మైసూర్–డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు ఈ ప్రాజెక్టును రూ.405 కోట్ల పెట్టుబడితో చేపట్టాయి. బంగారం తవ్వకం, శుద్ధి, ప్రాసెసింగ్, విక్రయాలన్నీ ఇక్కడే జరుగుతాయని తెలిపారు. తొలి ఏడాది 400 కేజీల బంగారం ఉత్పత్తితో ప్రారంభమై, తదుపరి దశలో 900 కేజీలకు, ఆపై 2 టన్నుల వరకు ఉత్పత్తి పెరుగుతుందని సంస్థ ప్రతినిధులు ప్రభాకరన్, నవీన్ లాల్ చంద్ర సీఎం‌‌‌‌ చంద్రబాబుకు వివరించారు.

 ఈ సందర్భంగా జోన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారంతో తయారైన ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌‌‌‌ను సంస్థలు ప్రభుత్వానికి బహూకరించాయి. అలాగే, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే బంగారాన్ని స్థానిక జ్యువెలరీ వ్యాపారులకే విక్రయిస్తామని సంస్థలు ప్రకటించాయి. తొలి దశలో వాసవీ జ్యువెలర్స్, సాయి సంతోష్ జ్యువెలర్స్, మధుమూర్తి జ్యువెలర్స్, ఎమరాల్డ్ జ్యువెలర్స్ వంటి సంస్థలకు బంగారం అందజేశాయి.