నా దగ్గరకు వస్తే పవన్ కు ట్యూషన్ చెబుతా: మంత్రి బొత్స

నా దగ్గరకు వస్తే పవన్ కు ట్యూషన్ చెబుతా: మంత్రి బొత్స

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై (Janasena Pawan Kalyan) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathayanarayana) సంచలన కామెంట్స్ చేశారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు పవన్ కల్యాణ్ అవగాహనతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర విద్యావ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ..... పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని విమర్శించారు. కావాలంటే తానే ట్యూషన్ చెబుతానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో విద్యా మంత్రిగా ఉన్నానని, అప్పుడు తమమీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించుకున్నామని అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ని వారి పార్టనర్ మీద సీబీఐ విచారణ జరిపించమని అడగాలన్నారు. . ఇప్పటి నుంచైనా పవన్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. 

బైజుస్ ఒప్పందంపై దమ్ముంటే పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలని పేర్కొన్నారు. TDP, జనసేన అధికారంలోకి రావడం కల్ల…సమీప భవిష్యత్తులో అటువంటి అవకాశం లేదని ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్  కలలు కంటున్నారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. బైజుస్ కంటెంట్ రాష్ట్రంలో చదువున్న విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బైజ్యుస్, ఐబీ కోసం ఒక్క రూపాయి కట్టినట్టు నిరూపించగలిగితే అప్పుడు మాట్లాడాలని ఫైర్‌ అయ్యారు. EAMCET కౌన్సిలింగ్ పై స్పష్టత ఇచ్చిన బొత్స సత్యన్నారాయణ.. మూడోవిడత కౌన్సిలింగ్ కోసం తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయని వెల్లడించారు. అడ్మిషన్ల పై విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.