ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మ్యాడ్ ఫెలో

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మ్యాడ్ ఫెలో

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక మ్యాడ్ ఫెలో అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తనను హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.

‘ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిని గృహ నిర్భందం చేయాలని ఆదేశించడం దుర్మార్గం. దేశంలో తానే అత్యున్నత అధికారంలో ఉన్నట్లు ఎస్ఈసీ రమేష్ చౌదరి ఫీలవుతున్నాడు. నువ్వు ఒక ఆఫ్ట్రాల్ రిటైర్డ్ అధికారివి. చంద్రబాబు దయతో నీకు ఈ పదవి ఇచ్చాడని.. ఆయనకు బంట్రోతు మాదిరిగా పనిచేస్తున్నావు. ఆదేశాలు ఇచ్చే ముందు అవి అమలు అవుతాయో లేదో చూసుకోవాలి. ఆయనకు ఇంగితజ్ఙానం లేదు. నిమ్మగడ్డ ఇలాంటి ఆదేశిలిస్తారని మేం ముందే ఊహించాం. నేను పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని.. నా అధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి నన్ను హౌస్ అరెస్ట్ చేయమనడం ఏంటీ? ఆయన ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. నేను రాష్ట్ర మంత్రిని.. నా పని నేను చేసుకుంటా’ అని ఆయన అన్నారు.

కాగా.. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో.. హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

For More News..

మంత్రి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషనర్ ఆదేశం

వీడియో: అది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్.. పరిగెత్తుకెళ్లి లారీ కిందపడిన వ్యక్తి

యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి