పవన్ తిక్క.. జన సైనికులే, ఆ తిక్కకు లెక్క ప్యాకేజీ: మంత్రి రోజా

పవన్ తిక్క.. జన సైనికులే, ఆ తిక్కకు లెక్క ప్యాకేజీ: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచే ఉన్నారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో  నాకు తిక్క ఉంది.. దాని ఓ లెక్క ఉంది అని చెప్పిన విధంగా.. ఆయన తిక్క జనసైనికులని... లెక్క ప్యాకేజీ అని ఎద్దేవా చేశారు. పవన్ ప్రజల కోసం పార్టీ స్థాపించలేదని.. ప్యాకేజీ, పొత్తుల కోసమే జనసేన పెట్టారని విమర్శించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడు దొంగలని మంత్రి రోజా అన్నారు.  బాబు ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు.   రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు దగ్గర ముసుగు తీసేశారని అన్నారు. తాము మెుదటి నుంచి టీడీపీ, జననసేన ఒక్కటేనని చెప్తున్నామని అది నిజమని పవన్ కల్యాణ్ నిరూపించారని అన్నారు.పవన్‌కు కనీస జ్ఞానం కూడా లేదు అని అన్నారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగ అని రోజా మండిపడ్డారు. స్కిల్‌ కుంభకోణంలో ఐటీ, జీఎస్టీ, ఈడీలు విచారణలు జరిపాయి అని చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి మీద చెప్పులేసిన చంద్రబాబునే ఏమీ చేయలేకపోయాడు. ఇంక సీఎం వైఎస్ జగన్‌ను ఏం చేయగలడు అని నిలదీశారు. నిజంగా స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబుకు తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ విచారణ కోరాల‌ని మంత్రి ఆర్‌కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.