మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌పై ఈసీ సీరియస్..భయపడొద్దంటూ అధికారులకు అభయం

మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌పై ఈసీ సీరియస్..భయపడొద్దంటూ అధికారులకు అభయం

అమరావతి: తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ సీరియస్ అయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా మీడియాతో చేసిన కామెంట్లపై స్పందించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు,రిటర్నింగ్ అధికారులు అభద్రతకు లోను కావద్దని అభయం ఇస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటీ ఈసీ అనుమతి తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.  గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే చెప్పిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేస్తుందని, బెదిరింపులకు గురిచేసేలా ఎంతటి పెద్దవారు ప్రకటన చేసినా అధికారులు భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు అనైతికమని, ఉద్యోగుల పట్ల దుందుడుకు చర్యలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈయన స్పష్టం చేశారు. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమే…వ్యవస్థలు మాత్రమే శాశ్వతం అని గుర్తుంచుకోవాలని తెలిపారు.

For More News..

ర్యాగింగ్ చేసిన నలుగురు అమ్మాయిలకు ఐదేళ్ల జైలు

ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉందా.. అయితే అప్డేట్ చేసుకోండి

108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి

వీడియో: అది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్.. పరిగెత్తుకెళ్లి లారీ కిందపడిన వ్యక్తి