హైదరాబాద్ సిటీ, వెలుగు: అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు డిస్ట్రిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఎ.వందన తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్లో జాబ్మేళా ఉంటుందని, 18 నుంచి 35 ఏండ్లలోపు వయసు ఉండి, ఫార్మసీ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూలకు రావాలన్నారు.
100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని, రిటైల్ ట్రైనీ అసోసియేట్ 30, ట్రైనీ ఫార్మసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్ 20, పీసీఐ సర్టిఫికెట్ కలిగిన ఫార్మసిస్ట్ 30 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా బీ.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలన్నారు. ఇతర వివరాలకు 93462 04294 ఫోన్నంబర్లో సంప్రదించాలని సూచించారు.
