స్పోర్ట్స్‌ కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

స్పోర్ట్స్‌ కోచ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు గిరిజన సంక్షేమ మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో స్పోర్ట్స్‌ కోచ్‌లుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. కబడ్డీ, ఆర్చరీ, వాటర్‌ స్పోర్ట్స్‌లో ఏడాది పాటు ఎన్‌ఎస్‌ఎన్‌ఐసీ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. www.twd.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పింది. బయోడేటాను [email protected]కు లేదా హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 17 వరకు అందజేయాలని సూచించింది. వివరాలకు 99085 50250, 92472 67050 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది.