
అమరావతి: అన్ లాక్ నిర్ణయాల్లో ఏపీ ఎస్ ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ అనంతరం మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా.. కొవిడ్ నిబంధనల మేరకు సగం సీట్ల భర్తీకే అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బుకింగ్ లో కూడా సగం సీట్లే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. సగం సీట్లతో నడవడం చాలా నష్టాలకు గురిచేస్తున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నడుపుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా మార్పులు చేశారు. నడుస్తున్న బస్సుల్లో కూడా సీట్లన్నీ భర్తీ చేసుకుని నడుస్తాయి.