శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా సమీపంలో గుప్త నిధుల కోసం తవ్విన ప్రాంతాన్ని శనివారం పురవస్తు శాఖ అధికారులు పరిశీలించారు .
మొలంగూర్ ఖిల్లా ప్రాంతంలో ఇటీవల కొందరు కారులో వచ్చి అర్ధరాత్రి సమయంలో మొలంగూర్ ఖిల్లా పరిసరాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. విషయం వెలుగు చూడడంతో పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవితేజ , కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి , సర్పంచ్ పూదరి రాజు తో కలిసి పరిశీలించారు .
