పిల్లలు వద్దనుకుని పిల్స్​ వాడితే సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయా? అయితే ఏం చేయాలంటే..

పిల్లలు వద్దనుకుని పిల్స్​ వాడితే సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయా? అయితే ఏం చేయాలంటే..

ఈమధ్య బర్త్​ కంట్రోల్​ పిల్స్​  కామన్​ అయ్యాయి. పిల్లలకి సెక్యూర్డ్​ లైఫ్​ ఇవ్వాలని కొందరు, కెరీర్​ డిస్టర్బ్​ అవుతుందేమోనని భయంతో ఇంకొందరు పిల్లలకి గ్యాప్​ ఇస్తున్నారు. అందుకోసం బర్త్​ కంట్రోల్​ పిల్స్​  వేసుకుంటున్నారు . అయితే వీటివల్ల చాలా సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తున్నాయి. కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఆడవాళ్లు. మరి ఆ సమస్యలేంటి? వాటినుంచి ఎలా బయటపడాలి?

బర్త్​ కంట్రోల్​ పిల్స్​ రెగ్యులర్​గా వేసుకోవడం వల్ల  శరీరంలో విటమిన్​–బి, సి, ఈ, జింక్​, సెలీనియం, మెగ్నీషియం తగ్గుతుంది. వాటిని సరిచేయాలంటే  రెయిన్​బో డైట్​ ఫాలో అవ్వాలి. నాన్​వెజ్​, పాలు, వెజిటెబుల్స్​,  బ్రెడ్​,  తృణధాన్యాలు,  డ్రై ఫ్రూట్స్​, పండ్లు , స్వీట్స్​ వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్​ సలహా మేరకు మల్టీవిటమిన్​  మెడిసిన్స్​ కూడా వేసుకోవచ్చు.

పిల్స్​ వల్ల చాలామందిలో కోపం, చిరాకు, బాధ లాంటి ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి.  ఆ ఒత్తిళ్ల  నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ  మెడిటేషన్​ చేయాలి. ఉదయం ఓ అరగంటైనా ఎక్సర్​సైజ్​ చేయాలి. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. 

ఈమధ్య చాలామంది డాక్టర్​ని  కన్సల్ట్​ అవ్వకుండానే  పిల్స్​ వాడుతున్నారు.  అవగాహన లేకపోవడం  వల్ల మోతాదుకి మించి పిల్స్​ వేసుకుంటున్నారు. కానీ, వాటివల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవర్​ డోస్​ అవడం  వల్ల వివిధ రకాల  సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయి. అందువల్ల  మెడిసిన్స్​ వేసుకునే ముందు ఒక్కసారి డాక్టర్​ని కలవాలి. అలాగే గట్​ హెల్త్​ని కాపాడుకోవడానికి ప్రో బయోటిక్స్​ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగ, ఎక్కువగా తీసుకుంటుండాలి. పేగు సంబధిత హెల్త్​కి హాని చేసే షుగర్​, రిఫైన్డ్ ఆయిల్స్​, రిఫైన్డ్​​ కార్బో హైడ్రేట్స్​కి దూరంగా ఉండాలి.

బర్త్ కంట్రోల్​ పిల్స్​  కాలేయం పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయి.  శరీరంలోని చాలా హార్మోన్ల జీవక్రియ కాలేయంలోనే జరుగుతుంది. అంతేకాదు శరీరాన్ని డిటాక్స్​ చేసి వేస్టుని కూడా తొలగించేది కాలేయమే.

అయితే ఈ పిల్స్​ ఆ పనులకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే పిల్స్​ రెగ్యులర్​గా వాడేవాళ్లు  కాలేయాన్ని డిటాక్స్​ చేసే తులసీ టీ  ఎక్కువగా తీసుకోవాలి.