
హైదరాబాద్, వెలుగు: రియల్‌మీ సీ65 పేరుతో బడ్జెట్5జీ ఫోన్ను రియల్‌మీ లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా, ఐకంఫర్ట్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ల చార్జింగ్ వంటి ఆకర్షణలు ఉన్నాయి. 4జీబీ+64జీబీ యూనిట్ ధర రూ.10,500 కాగా, 6జీబీ+128జీబీ యూనిట్ ధర రూ.12,500.