
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ లేటెస్ట్ వెర్షన్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసింది. ధర రూ.7.49 లక్షల నుంచి రూ.13.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) మధ్య ఉంది. టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూతో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పోటీ పడుతోంది. బుకింగ్స్ మే 15న ఓపెన్ అవుతాయి. మే 26 నుంచి డెలివరీస్ మొదలవుతాయి. ఈ కారులో 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.