
న్యూఢిల్లీ: తాము ఈసారి పది వేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని మనదేశంలో మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ వెల్లడించారు. హెచ్‌సీఎల్ టెక్ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 2,700 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకున్నట్టు ప్రకటించింది. కంపెనీ వృద్ధి ఆశించినస్థాయిలో ఉన్నందున కొత్త వారికి తప్పకుండా ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. తాజా క్వార్టర్లో ఈ కంపెనీ రూ.3,986 కోట్ల నికరలాభం సంపాదించింది.