మోడీ భారత్ కు ప్రధానా? లేక పాక్ కు రాయబారా?

మోడీ భారత్ కు ప్రధానా? లేక పాక్ కు రాయబారా?

ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోడీ పాకిస్థాన్ రాయబారిలా పదే పదే పాక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిలిగురిలో సీఏఏ, ఎన్ ఆర్ సీకి వ్యతిరేకంగా ర్యాలీ సందర్భంగా మాట్లాడిన ఆమె… ఇండియా విభిన్న సాంప్రదాయాలకు నిలయమన్నారు. మోడీ ఇండియాకు ప్రధానా? లేక పాక్ రాయబారా? అని ప్రశ్నించారు.  పదే పదే ఇండియాను పాకిస్థాన్ తో ఎందుకు పోల్చుతారని అన్నారు. మోడీ హిందువుల గురించి మాట్లాడకుండా.. పాకిస్థాన్ రాయబారిలా రోజంతా పాకిస్థాన్ గురించి మాట్లాడతారని అన్నారు.

‘ఎవరైనా ఉద్యోగం గురించి ప్రశ్నించినా పాకిస్థాన్ వెళ్లమంటారు..ఇండస్ట్రీస్ లేవన్నా పాకిస్థాన్ వెళ్లమంటారు.పాక్ గురించి వాళ్లు మాట్లాడుకుంటారు. మనం ఇండియన్స్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా కూడా ఇంకా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుచేటు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తాం. సీఏఏ చట్టం రద్దయ్యే వరకు తమ పోరాటం ఆగదు. సీఏఏ, ఎన్ ఆర్ సీ అమలు చేయబోమని మోడీ అంటుంటే.. కేంద్రమంత్రులేమో అమలు చేస్తామంటారు.వాళ్లకే క్లారిటీ లేదు‘ అని అన్నారు మమతా బెనర్జీ.