
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపును అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు ముగిసాయి. ఈ సందర్బంగా.. దేశంలో మొదటి సారి ఎంపిరికల్ డేటాతో బీసీ రిజర్వేషన్ లు తెచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కోర్టుకు తెలిపారు ఏజీ. ఏ రాష్ట్రం దగ్గర ఎంపిరికల్ డేటా లేదన్నారు. రాజ్యాంగంలోని 243 ఓ ప్రకారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక , కోర్టుల జోక్యం ఉండకూడదని తెలిపారు ఏజీ. SC, ST లకు సంబంధించి కేంద్రం నిర్వహించిన 2011 జనగణన డేటా మాత్రమే ఉందన్నారు. 2011 తరువాత కేంద్రం జనగణన నిర్వహించలేదని కోర్టుకు చెప్పారు.
తెలంగాణ లో వర్చువల్ జనగణన నిర్వహించారని కోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్. ఇందిరా సహాని కేసుపై అడ్వొకేట్ క్లారిటీ ఇచ్చారు. విద్యా ,ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, పొలిటికల్ లోకల్ బాడీ రిజర్వేషన్లు వేరని.. లోకల్ బాడీలో రిజర్వేషన్ ల పెంపునకు ఇందిరా సహాని కేస్ తీర్పు వర్తించదని కోర్టులో వాదించారు. ఇందిరా సహాని కేస్ తీర్పు విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ పై మాత్రమేనని చెప్పారు. ఇక్కడ రాజకీయంగ్ లోకల్ బాడీ లో రిజర్వేషన్ లు తెచ్చారన్నారు. ఇందిరా సుహానీ తీర్పు విద్యా, ఉద్యోగాల్లో మాత్రమేనని చెప్పారు. లో కల్ బాడీ ఎన్నికల్లో ఇందిరా సుహానీ తీర్పు వర్తించదన్నారు.