హెచ్‌సీఏ ప్రెసిడెంట్గా అరిశనపల్లి జగన్ మోహన్ రావు బాధ్యతలు

హెచ్‌సీఏ ప్రెసిడెంట్గా అరిశనపల్లి జగన్ మోహన్ రావు బాధ్యతలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ గా అరిశనపల్లి జగన్ మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు.  ఉప్పల్ స్టేడియంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తో పాటు నూతన కార్యవర్గం కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.  

ఇటీవల జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన జగన్ మోహన్ రావు  సమీప అభ్యర్థి అమర్‌నాథ్‌ పై  ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.  ప్రస్తుతం జగన్ మోహన్ రావు  హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఉన్నారు.