అర్జున్ దాస్, శాండీ మాస్టర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తమిళ చిత్రం ‘సూపర్ హీరో’. తెలుగులో ‘సూపర్ హీరో బాబు’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కె.ఎస్. సినిష్, శంజన్ జి కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అర్జున్ దాస్‌తోపాటు లీడ్ యాక్టర్స్ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది.
తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, చిన్నారులకు ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తోపాటు అర్జున్ దాస్-శాండీ మాస్టర్ కాంబినేషన్, హేషమ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
