
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ టెన్నిస్ ప్లేయర్లు అర్జున్ ఖడే–విజయ్ సుందర్ ప్రశాంత్ జోడీ.. స్విస్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్‌లో అర్జున్–ప్రశాంత్ 5–7, 5–7తో మూడోసీడ్ అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)–హెండ్రిక్ జీబెన్స్ (జర్మనీ) చేతిలో ఓడింది.
గంటా 22 నిమిషాల మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లు స్థాయికి తగిన పెర్ఫామెన్స్ చూపెట్టలేకపోయారు. గతేడాది రిత్విక్ బొల్లిపల్లితో జతకట్టిన అర్జున్ అల్మాటీ ఓపెన్‌ను గెలుచుకున్నాడు. కానీ ఈసారి తన రెండో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం నిరాశపర్చాడు. ఆసియా గేమ్స్ సన్నాహాల్లో భాగంగా ఈ నెలలో మూడు ఇండియా జట్లు ఏటీపీ టూర్‌లో పోటీపడ్డాయి.