పోలీస్ చెకింగ్ పేరుతో డబ్బులు కొట్టేసిన ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

పోలీస్ చెకింగ్ పేరుతో డబ్బులు కొట్టేసిన   ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్
  • అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన రాచకొండ సీపీ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్నికల కోడ్​ను అవకాశంగా చేసుకుని వెహికల్‌‌‌‌ చెకింగ్ పేరుతో దోపిడీకి పాల్పడ్డ కేసులో ఆర్మ్డ్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌(ఏఆర్‌‌‌‌‌‌‌‌)కానిస్టేబుల్‌‌‌‌ బళ్లారి శ్రీకాంత్‌‌‌‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 బ్యాచ్‌‌‌‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌ రాచకొండ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకాంత్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ వివరాలను రాచకొండ సీపీ డీఎస్‌‌‌‌ చౌహన్‌‌‌‌కు అందించారు.

దీంతో శ్రీకాంత్‌‌‌‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ సీపీ శనివారం ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ చెకింగ్ పేరుతో గురువారం రాత్రి బేగంబజార్‌‌‌‌కు చెందిన ప్రదీప్‌‌‌‌శర్మ(30)ను దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్‌‌‌‌ రోడ్‌‌‌‌ నం.1లోని తాజ్‌‌‌‌కృష్ణ మీదుగా వెళ్తున్న ప్రదీప్ శర్మను శ్రీకాంత్‌‌‌‌ మరో వ్యక్తితో కలిసి పోలీస్ పెట్రోలింగ్‌‌‌‌ బైక్‌‌‌‌పై వచ్చాడు. ఇన్నోవా కారులో మరో ఇద్దరు వచ్చారు.

ప్రదీప్‌‌‌‌ వద్ద రూ.18.50లక్షలు తీసుకుని ఖైరతాబాద్‌‌‌‌ మెట్రో స్టేషన్‌‌‌‌ వద్ద వదిలేశారు. ప్రదీప్‌‌‌‌  కంప్లయింట్ ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేశారు .బంజారాహిల్స్‌‌‌‌ నుంచి ఖైరతాబాద్‌‌‌‌, లక్డీకపూల్‌‌‌‌, కోఠి, మలక్‌‌‌‌పేట్‌‌‌‌, సైదాబాద్‌‌‌‌ వరకు సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. బైక్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి రాచకొండ కమిషనరేట్‌‌‌‌కు చెందిన పెట్రోలింగ్‌‌‌‌ వెహికల్‌‌‌‌గా గుర్తించారు. ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌‌‌‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల అరెస్ట్‌‌‌‌ వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించే అవకాశాలున్నాయి.