చైనాలో సైనిక తిరుగుబాటు ?

చైనాలో సైనిక తిరుగుబాటు ?
  • పీఎల్ఏ కంట్రోల్​లో బీజింగ్​ సోషల్ ​మీడియాలో ప్రచారం

న్యూఢిల్లీ: చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్​ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ను పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్ఏ) అధికారులు హౌస్​ అరెస్ట్​ చేశారని పోస్టులు కనిపిస్తున్నాయి. మన దేశంలో కూడా ఈ రూమర్​ బాగా ప్రచారంలో ఉంది. బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి కూడా చైనా ప్రెసిడెంట్​ హౌస్​ అరెస్ట్​ అంటూ ప్రచారం జరుగుతోందని ట్వీట్​ చేశారు.

దేశ రాజధాని బీజింగ్​ను పీఎల్ఏ తన కంట్రోల్​లోకి తీసుకుందని అక్కడి ప్రజలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. పలు వీడియోలలో పీఎల్ఏ వాహనాలు రోడ్లపై దూసుకెళ్తుండడం కనిపించింది. అవన్నీ రాజధాని బీజింగ్​ వైపు వెళ్తున్నాయని నెటిజన్లు చెప్తున్నారు. కరోనా కాలంలో దాదాపు రెండేళ్లపాటు దేశం వదలని జిన్​పింగ్​ ఇటీవలే సమర్ఖండ్​ వెళ్లారు. అక్కడ జరిగిన షాంఘై కో ఆపరేటివ్​ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సమావేశాలలో పాల్గొన్నారు.

ఆ సమయంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీ టాప్​ లీడర్లు సమావేశమై పార్టీ చీఫ్, ఆర్మీ ఇన్​చార్జి పదవుల నుంచి జిన్​పింగ్​ను తొలగించారని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని చైనా ఆర్మీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, న్యూస్​ ఏజెన్సీలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం బీజింగ్​ నుంచి వెళ్లే ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు మరో యూజర్​ చెప్పారు. మరోవైపు, చైనా అమలుచేస్తున్న జీరో కొవిడ్​ పాలసీ ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా క్వారెంటైన్​లో ఉండాలి. ఈ రూల్​మేరకు సమర్ఖండ్​ నుంచి తిరిగొచ్చినంక జిన్​ పింగ్​ కూడా క్వారెంటైన్​లో ఉన్నారని మరికొందరు చెప్తున్నారు.