మే 8న కొడంగల్‎లో సీఎం రేవంత్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

మే 8న కొడంగల్‎లో సీఎం రేవంత్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 8న కొడంగల్  పర్యటనకు రానున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం భారీ ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సౌండ్ సిస్టమ్ విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సీఎం పర్యటనను లైవ్ కవరేజ్ చేసేందుకు డ్రోన్ కెమెరాలతో పాటు వీడియో గ్రాఫర్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. కడా అధికారి వెంకట్ రెడ్డి, ఆర్‌‌‌‌ఐఈ రాములు పాల్గొన్నారు.