కోర్టు విచారణకు రాకుండా.. పదేండ్లుగా పరారీలోనే

కోర్టు విచారణకు రాకుండా.. పదేండ్లుగా పరారీలోనే

హైదరాబాద్, వెలుగు: చోరీ కేసులో కోర్టు విచారణకు హాజరుకాకుండా పదేండ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన ఆకెళ్ల ఫణికుమార్ 2011లో సౌత్ లాలాగూడకు చెందిన ప్రొఫెసర్ రవిచంద్ర క్రెడిట్ కార్డును దొంగిలించాడు. ఆ కార్డు వాడి రూ.లక్షా 50 వేలు తీసుకున్నాడు. రవిచంద్ర కంప్లయింట్ మేరకు ఓయూ పోలీసులు ఫణికుమార్​పై కేసు ఫైల్ చేశారు. తర్వాత కేసును సీఐడీకి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ చేశారు.

2013లో కాకినాడలోని సత్యశేషు నర్సింగ్ హోం సమీపంలోని రామలింగేశ్వర అగ్రహరంలో ఫణికుమార్​ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీకి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. తర్వాత బెయిల్​పై రిలీజైన ఫణికుమార్ కోర్టు విచారణకు హాజరుకాకుండా పదేండ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నాంపల్లి కోర్టు అతనిపై నాన్​బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పెండింగ్​కేసులపై ఏర్పాటైన సీఐడీ స్పెషల్ టీమ్​శుక్రవారం ఫణికుమార్​ను అదుపులోకి తీసుకుంది. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించింది.