Paris Olympics 2024: నీరజ్ చోప్రాతో ఫైనల్లో తలపడనున్న పాక్ అథ్లెట్

Paris Olympics 2024: నీరజ్ చోప్రాతో ఫైనల్లో తలపడనున్న పాక్ అథ్లెట్

పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్ 2024లో అథ్లెటిక్స్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. అతను 86.59 మీటర్ల త్రోను విసిరి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే జావెలిన్‌ను  84 మీటర్ల దూరం విసరాలి. అర్షద్ నదీమ్ తన మొదటి ప్రయత్నంలో 86.59 మీటర్లతో 12 మందితో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి.

అంతక ముందు భారత ఆటగాడు నీరజ్ చోప్రా కూడా 89.34 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. మంగళవారం(ఆగష్టు 6) జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఈ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ మొదటి ప్రయత్నంలోనే బల్లాన్ని 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. చోప్రా కెరీర్‌లో  ఇది అత్యుత్తమ ప్రదర్శన.  ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి. భారత్‌కు చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ జెనా ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. అత్యుత్తమంగా అతను తన బల్లాన్ని 80.73 మీటర్ల దూరం విసరగలిగాడు.