- అన్ని విషయాలు చదివి మాట్లాడితే తప్పకుండా సమాధానం ఇస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తాను ఇచ్చిన తీర్పును పూర్తిగా చదవకుండా ఆరోపణలు చేయడం సరికాదని, జడ్జిమెంట్లోని అన్ని విషయాలు చదివి మాట్లాడితే తప్పకుండా సమాధా నం ఇస్తానని కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చి చెప్పారు. గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీచేసిన వ్యక్తికి అనుకూలంగా మీరు నిర్ణ యం తీసుకున్నారు.. మీరంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది.. కానీ, మా అప్పీల్ వినండి” అనగానే స్పీకర్ ప్రసాద్ జోక్యం చేసుకున్నారు.
“న్యాయ వ్యవస్థలో ఒక అంశంపై కోర్టుకు పోతం.. జడ్జి తీర్పు ఇస్తరు. అక్కడ న్యాయం జరగలేదనుకుంటే ఇంకో కోర్టుకు పోతం.. కానీ, జడ్జిమెంట్ చదవకుండా నా మీద మీరు ఎన్నో ఆరోపణలు చేశారు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో జడ్జిమెంట్‌లో నేను ఇచ్చిన అన్ని వివరాలు చదివి నాతో మాట్లాడితే నేను సమాధానం ఇస్తా’ అని స్పష్టం చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ “ మీరంటే మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం. కానీ, మీరు తీసు కున్న నిర్ణయం తప్పు అయినా సభ్యుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. మీరు జ్యుడిషియరీ అథారిటీ మేం కాదనట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం మా బాధ్యత. తప్పకుండా హైకోర్టులో అడుగుతం” అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నరు: మంత్రి పొంగులేటి
కేటీఆర్ మాట్లాడుతుండ గా మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల అం శంపై జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ ఇచ్చిన తీర్పును కేటీఆర్ ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. సీనియర్ ఎమ్మెల్యే అయి ఉండి గవర్నర్ ప్రసంగంపై స్ర్కీన్ మీద కట్టుకథలు అద్భుతంగా చెప్పారని ఎద్దేవా చేశారు. వీళ్ల అహంకారం తగ్గకపో వడం వల్లే ప్రజలు వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడగొట్టార ని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో సైతం వాళ్ల పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. ఇంకా అవే కట్టుకథలు, అబద్ధాలు చెబుతున్నార ని మంత్రి ఫైర్ అయ్యారు. ఫిరాయింపులను ప్రొత్సహించిందే బీఆర్ఎస్ వాళ్లని పొంగులేటి పేర్కొన్నారు.
