5 వేల మంది పిల్లలు..  ఐస్క్రీమ్స్.. గిన్నిస్ రికార్డ్

5 వేల మంది పిల్లలు..  ఐస్క్రీమ్స్.. గిన్నిస్ రికార్డ్

5 వేల మందికి పైగా పిల్లలతో కలిసి అరుణ్ ఐస్‌‌‌‌క్రీమ్స్ గిన్నిస్ వరల్డ్​ రికార్డు సృష్టించింది. జూబ్లీహిల్స్‌‌‌‌ లో జరిగిన కార్యక్రమంలో ఒకేసారి 5,113 మంది విద్యార్థులు ఒకే చోట చేరి రియల్ మిల్క్, క్రీమ్‌‌‌‌తో తయారైన స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్​విచ్, చాక్లెట్ కోన్స్​ను నిరంతరం 30 నిమిషాల పాటు ఆస్వాదిస్తూ ఈ రికార్డును సాధించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అరుణ్ ఐస్‌‌‌‌క్రీమ్ యాజమాన్యానికి అవార్డు, రికార్డు పత్రాలను అందజేశారు.– వెలుగు, జూబ్లీహిల్స్​