గుజరాత్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతయ్ : కేజ్రీవాల్

గుజరాత్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతయ్ : కేజ్రీవాల్

గుజరాత్ ఎగ్జిట్ పోల్స్పై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అయితే ఈ సర్వేలు పూర్తిగా తప్పని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ప్రజలు నిరూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెల్లడయ్యాక ఈ విషయాలు అందరికీ అర్థమవుతాయని చెప్పారు. గుజరాత్లో మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన తమ పార్టీ 15 నుంచి 20శాతం ఓట్లు సాధించడం గొప్ప విషయమని కేజ్రీవాల్ అన్నారు. అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదని చెప్పారు.


 
గుజరాత్లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ రెండో స్థానం, ఆమ్​ ఆద్మీ పార్టీ మూడో ప్లేస్​కు పరిమితమవుతాయని తెలిపాయి. గుజరాత్​లో 182 అసెంబ్లీ  స్థానాలు ఉండగా 100కుపైగా స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించాయి. ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో మాత్రం ఎగ్జిట్​ పోల్స్​ సర్వేలన్నీ ఆప్​ వైపే మొగ్గు చూపాయి.ఎంసీడీలో మొత్తం 250 వార్డులు ఉండగా, కావాల్సిన మెజారిటీ 126. అయితే ఆప్ కు 145కు పైగానే సీట్లు వస్తాయని అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.