రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌లో మహేష్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’’. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం.మురళి (గోదావరి కిట్టయ్య) నిర్మించారు.
మే 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ, హాస్యంతో పాటు సెంటిమెంట్ ప్రధానంగా సాగే సినిమా ఇది.
తండ్రీకూతుళ్ల అనుబంధంతో పాటు తప్పటడుగులు వేస్తే యూత్ ఏం కోల్పోతారనే హెచ్చరిక ఉంది. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ. ‘ప్రేయసి రావే’ తరహాలో నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.

