
హైదరాబాద్, వెలుగు : జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్ గౌడ్, కోదాడలో మేకల సతీశ్ రెడ్డి, నాగర్ కర్నూల్‌లో వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్‌రావు, వైరా(ఎస్టీ)లో తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట(ఎస్టీ) నుంచి ముయబోయిన ఉమాదేవిలకు సీట్లను కేటాయించింది. శంకర్‌గౌడ్, మరో ఇద్దరు మినహా పవన్ కల్యాణ్ సమక్షంలో సోమవారం పార్టీలో చేరిన వారికే ఎక్కువ టికెట్లు దక్కడం గమనార్హం.