నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టెస్ట్​

నేటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టెస్ట్​

డబ్ల్యూటీసీ ఫైనల్​ బెర్త్​పై కన్నేసిన రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన 

ఉ. 9.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో లైవ్​

నాగ్​పూర్ : టార్గెట్​ క్లియర్​.. ప్లేయర్లు రెడీ.. స్టార్లందరూ సిద్ధం.. ఇక మిగిలింది యాక్షనే.  టెస్టు క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అసలైన కిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టే పోరు రానే వచ్చింది. క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న నాలుగు టెస్టుల బోర్డర్​–గావస్కర్ ట్రోఫీలో  భాగంగా గురువారం మొదలయ్యే తొలి టెస్టులో బలమైన ఇండియా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరో వైపు  ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్​ కూడా వచ్చేసింది. దాంతో, ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంగారూల పని పట్టి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు ఖాయం చేసుకోవాలని ఇండియా ఆశిస్తోంది. గత ట్రోఫీలో స్వదేశంలో తమను ఓడించిన ఇండియాపై రివెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీర్చుకోవాలని కంగారూ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కసిగా ఉంది.

రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కీలకం.. బరిలోకి భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తును ఖరారు చేసేది కావడంతో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమిండియాతో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అత్యంత కీలకం కానుంది. గత ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశ నేపథ్యంలో  ఇందులోనూ ఫెయిలైతే అతని కెప్టెన్సీకి ముప్పుంది. కాబట్టి   కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇక, ఈ సిరీస్​లో ఫైనల్​ఎలెవన్​ను ఎంచుకోవడం కోచ్​ ద్రవిడ్, కెప్టెన్​ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కత్తిమీద సాముగా మారింది. కీపర్​ పంత్​ లేకపోవడంతో.. ఆంధ్ర కుర్రాడు కేఎస్​ భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడటం ఖాయమే. మిగతా జట్టులో చాలా స్థానాలపై క్లారిటీ ఉన్నా.. రెండు స్థానాల కోసం కేఎల్​ రాహుల్​, శుభ్​మన్​ గిల్​, సూర్యకుమార్​ మధ్య పోటీ నెలకొంది. ఓపెనింగ్​లో రోహిత్​కు జతగా వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్​ను పంపిస్తే.. గిల్​ను మిడిలార్డర్​లో ఆడించొచ్చు. అప్పుడు సూర్యబెంచ్​కు పరిమితంకానున్నాడు. కానీ ప్రస్తుతం గిల్, సూర్య మంచి ఫామ్​లో ఉన్నారు. సీనియారిటీ చూస్తే లోకేశ్​ను పక్కనబెట్టలేని పరిస్థితి. రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరిగా లోకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా ఒత్తిడి ఉంది. పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న తను ఇప్పుడు సత్తా చాటకుంటే జట్టులో చోటు కోల్పోవాల్సి ఉంటుంది. ఇక, 3,4 నంబర్లలో టెస్టు స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుజారా, మరో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. ఇది స్పిన్​–ఫ్రెండ్లీ వికెట్​ కావడంతో ముగ్గురు స్పిన్నర్లలో అశ్విన్​, జడేజా ఖాయం. మూడో​ స్పిన్నర్​గా అక్షర్, కుల్దీప్​ మధ్య పోటీ ఉంది. షమీ, సిరాజ్ పేస్​ బౌలింగ్​ను నడిపిస్తారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలమైన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మన బౌలర్లు ఏమేరకు దెబ్బకొడతారన్నది విజయానికి కీలకం కానుంది. 


తుది జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్​ (కెప్టెన్​), గిల్ / రాహుల్​, పుజారా, కోహ్లీ, గిల్ / సూర్యకుమార్​, కేఎస్​ భరత్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), జడేజా, అశ్విన్​, అక్షర్​ / కుల్దీప్​ ​, షమీ, ​ సిరాజ్.​
ఆస్ట్రేలియా: వార్నర్​, ఖవాజ, లబుషేన్​, స్మిత్​, హెడ్, హ్యాండ్స్​కోంబ్​, క్యారీ (కీపర్),  కమిన్స్​ (కెప్టెన్​), ఆస్టన్​ ఎగర్ / టాడ్​ ముర్ఫి, నేథన్​ లైయన్​, స్కాట్​ బోలాండ్​. 

పిచ్​, వాతావరణం
ఇది స్పిన్​ వికెట్​. లెఫ్టాండ్​ బ్యాటర్లకు ఇబ్బంది  ఉంటుంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వర్షం ముప్పు లేదు.  వాతావరణం పొడిగా, వేడిగా ఉండనుంది.

* 3 ఈ సిరీస్​లో కనీసం మూడు మ్యాచ్​లు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్​కు ఇండియా నేరు​గా క్వాలిఫై అవుతుంది

* 42-2 గత పదేళ్లలో స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఇండియా గెలుపోటముల రికార్డు

ఆసీస్​ను ఆపతరమా!
ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు ముందే ఇండియా వచ్చి ముమ్మరంగా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మన స్పిన్నర్లకు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖవాజాతో ఇండియా బౌలర్లకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పదు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని కంగారూల బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా పదునుగానే ఉంది.  టాపార్డర్ బలంగా ఉండగా... లోయర్​ ఆర్డర్​లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా చేయగలిగే  స్పిన్నర్​ ఎగర్​ వైపు ఆసీస్​  మొగ్గు చూపుతోంది. టాప్​ స్పిన్నర్ ​నేథన్​ లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా బ్యాటర్లకూ ముప్పుంది.  ఆసీస్ తుది జట్టులో నలుగురు లెఫ్టాండ్​ బ్యాటర్లు  వార్నర్, ఖవాజ, హెడ్, క్యారీ బరిలో దిగుతున్నారు. తుది జట్టులో స్మిత్​, లబుషేన్​కు తోడుగా హ్యాండ్స్​కోంబ్, రెన్​షా మధ్య పోటీ నెలకొంది. గాయం వల్ల ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కామెరూన్​ గ్రీన్​ లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది.