ఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ

ఇజ్రాయిల్ పీఎం ఒక దెయ్యం.. గాజాకు మోదీ అండగా నిలవాలన్న ఓవైసీ

ఇజ్రాయిల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ప్రధాని మోదీని కోరారు.

"నేను పాలస్తీనావైపు నిలబడతాను. కొనసాగుతాను. నేటికీ పోరాడుతున్న గాజా ధైర్యవంతులకు లక్షలాది వందనాలు. నెతన్యాహు ఒక దెయ్యం లాంటివాడు, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడు. మన దేశంలో ఒక బాబా ముఖ్యమంత్రి పాలస్తీనా పేరు చెప్పుకునే వారిపై కేసులు పెడతామని చెప్పారు. అందుకే బాబా ముఖ్యమంత్రిగారూ వినండి, నేను పాలస్తీనా జెండాను, మన త్రివర్ణ పతాకాన్ని కూడా గర్వంగా ధరించాను. నేను పాలస్తీనాకు అండగా ఉంటాను' అని హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఓవైసీ అన్నారు.

పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఇది మానవతా సమస్య" అని ఓవైసీ చెప్పారు. అంతకుముందు, ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ 'పాలస్తీనా హక్కుల' కోసం కాంగ్రెస్ తన మద్దతును అందించింది.