
హైదరాబాద్: హోటళ్లు, షాపులకు అర్ధరాత్రి 12 గంటల దాకా పర్మిషన్ఇవ్వాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్లో రాత్రి11 గంటలకే షాపులు మూసివేయాలని, నో ఫ్రెండ్లీ పోలీస్ అంటూ వైరల్ అవుతున్న వీడియోపై అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
‘జూబ్లీహిల్స్ పోలీసులుఈ ప్రకటన చేయగలరా? ఇరానీ ఛాయ్ హోటళ్లు, పాన్ షాపులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను కనీసం 12 వరకూ కొనసాగనివ్వాలి. లేదంటే అంతటా ఒకే విధానం ఉండాలి’ అని పేర్కొన్నారు. అయితే రాత్రి11కే షాపులను మూసివేయిస్తున్నారన్న వార్తలను పోలీసులు ఖండించారు.