పట్టు బిగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ ఆధిక్యం

పట్టు బిగించిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ ఆధిక్యం

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: యాషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ విజయానికి బాటలు వేసుకుంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోరాణిస్తూ  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ ఆధిక్యం సాధించి పట్టుబిగించింది.  ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరు 278/4తో మూడో రోజు, శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 325 వద్ద ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. కేవలం 47 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చి చివరి ఆరు వికెట్లు పడగొట్టిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  91 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. 

స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (3/88) దెబ్బకు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (50), బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(17) స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఔటవగా.. బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో (16), బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12), రాబిన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9) కూడా ఫెయిలయ్యారు. హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో రోజు చివరకు 130/2 స్కోరు చేసింది. వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (25), లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (30) ఔటవగా.. ఖవాజా (58 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), స్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 221 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ జట్టు 416 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో రెండు రోజుల ఆట మిగిలుంది.