రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

రోడ్డు ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట, వెలుగు : పట్టణంలో రోడ్డు నిర్మాణంతో రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం అశ్వారావుపేట పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ వద్ద రూ.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నూతన మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ జూపల్లి శశికళ, రమేశ్ తో కలిసి ఎమ్మెల్యే 

శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే పట్టణంలో సెంటర్ లైటింగ్ పనులు పూర్తి చేస్తామని, ఇచ్చినమాట ప్రకారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో అప్పారావు, తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.