Asia Cup trophy 2025: మోహ్సిన్ నఖ్వీ చీప్ ట్రిక్స్: ఆసియా కప్‌ను గుర్తు తెలియని చోటుకు తరలించిన ACC అధ్యక్షుడు

Asia Cup trophy 2025: మోహ్సిన్ నఖ్వీ చీప్ ట్రిక్స్: ఆసియా కప్‌ను గుర్తు తెలియని చోటుకు తరలించిన ACC అధ్యక్షుడు

ఆసియా కప్ ట్రోఫీపై డ్రామా నడుస్తోంది. 2025 సెప్టెంబర్ 28న ఫైనల్లో పాకిస్థాన్ ను చిత్తు చేసి టీమిండియా ఆసియా కప్ గెలుచుకుంది. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నిరసనగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‎గా ఉన్న పాకిస్తాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది. టోర్నీ విజేతగా నిలిచినప్పటికీ ఒట్టి చేతులతోనే దుబాయ్ నుంచి టీమిండియా ప్లేయర్స్ ఇండియా తిరిగొచ్చారు. దీంతో ఆసియా కప్ టైటిల్‎ను తన వెంటే తీసుకెళ్లారు మోహ్సిన్ నఖ్వీ.

ఈ మెగా టోర్నీ ముగిసి దాదాపు నెల కావొస్తున్నా టీమిండియాకు ట్రోఫీ అందలేదు. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు.. పాకిస్థాన్ క్రికెట్ చీఫ్  చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని ఏసీసీ ప్రధాన కార్యాలయం నుండి అబుదాబిలోని ఒక గుర్తుతెలియని ప్రదేశానికి తరలించినట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం ఇటీవల ఒక బీసీసీఐ అధికారి దుబాయ్‌లోని ఎసీసీ ఆఫీస్ కు వెళ్లగా.. ఆసియా కప్ ట్రోఫీని వేరే ప్రదేశానికి తీసుకెళ్లినట్టు.. ఆ టైటిల్ నఖ్వీ అదుపులో ఉందని సిబ్బంది చెప్పారట. 

ఆసియా కప్ టైటిల్ వివాదంపై BCCI కీలక నిర్ణయం:

ఇటీవలే ఆసియా కప్ 2025 ట్రోఫీని వెంటనే భారత క్రికెట్ జట్టుకు అందించాలని డిమాండ్ చేస్తూ ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి బీసీసీఐ మెయిల్ పంపింది. బీసీసీఐ మెయిల్‎కు మోహ్సిన్ నఖ్వీ అంతే ఘాటుగా సమాధానమిచ్చాడు. ఆసియా కప్ ట్రోఫీని భారతదేశానికి అప్పగించడం కుదరదని తేల్చి చెప్పాడు. ట్రోఫీని ఇండియాకు పంపేది లేదని కుండబద్దలు కొట్టాడు. ఒకవేళ బీసీసీఐ ట్రోఫీ కావాలనుకుంటే.. దుబాయ్‎లో ఒక ప్రజెంటేషన్ వేడుకను నిర్వహించి.. ఆ వేడుకలో తన చేతుల మీదుగా బీసీసీఐ అధికారి, ఒక టీమిండియా ప్లేయర్ ఆసియా కప్ టైటిల్ తీసుకోవచ్చని తెలిపాడు.

నఖ్వీ ప్రతిపాదనను బీసీసీఐ అంగీకరించలేదు. ట్రోఫీ అప్పగింతకు సంబంధించి నఖ్వీ ప్రపోజల్‎ను మేము అంగీకరించమని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్ టైటిల్ వివాదాన్ని ఐసీసీ దగ్గరకు తీసుకెళ్తామని.. రాబోయే ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన తెలిపారు.