V6 News

ఆసియా ఆర్చరీ చాంపియన్‌ షిప్‌: ఇండియాకు 3 కాంస్యాలు

ఆసియా ఆర్చరీ చాంపియన్‌ షిప్‌: ఇండియాకు 3 కాంస్యాలు

కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో సురేఖ జట్టు

ఆసియా ఆర్చరీ చాంపియన్‌ షిప్‌ లో ఇండియా జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో మన ఆర్చర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల రికర్వ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరులో అటాను దాస్‌ 6–5తో కొరియాకు చెందిన జిన్‌ హయెక్‌ ఒహ్‌ పై విజయం సాధించాడు. అనంతరం తరుణ్‌ దీప్‌ రాయ్‌ , జయంత తలూక్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో కలిసి రిక్వర్ టీమ్‌ ఈవెంట్‌ లో బరిలోకి దిగిన దాస్‌ 6–2తో చైనా జట్టు ను ఓడించాడు. దీపిక కుమారి, లైష్రమ్‌ బొంబ్యాల దేవి, అంకితా భాకట్‌ తో కూడిన మహిళల రికర్వ్‌ టీమ్‌ 5–1తో జపాన్‌ ను ఓడించి ఇండియాకు మరో కాంస్యం అందించింది. తెలుగు ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్నం జ్యోతి సురేఖ మరో ఈవెంట్‌ లో ఫైనల్‌ చేరింది. కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగంలో సురేఖ, ముస్కాన్‌ కిరార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రియా గుర్జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడిన ఇండియా 227–221తో ఇరాన్‌ జట్టును ఓడించి టాప్‌ సీడ్‌ కొరియాతో పసిడి పోరుకు సిద్ధమైంది. పురుషుల కాంపౌండ్‌ లో కూడా ఇండియా ఫైనల్​ చేరింది.