ఏషియన్ క్రీడలు (Asian Games 2026) క్రికెట్ పోటీల అధికారిక షెడ్యూల్ విడుదలైంది. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మెన్స్, ఉమెన్స్ కేటగిరీల్లో టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గత 2023 హాంజౌ ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో పసిడి పతకాలు సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఈసారి కూడా స్వర్ణ పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సేనకు క్వార్టర్స్ కి లైన్ క్లియర్:
మహిళల టోర్నమెంట్‌లో టాప్ ర్యాంక్ జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడటానికి అర్హత లభించింది. ఈ డ్రా ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి క్వార్టర్ ఫైనల్ పోరులో ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. భారత్ జపాన్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఈజీ అయినప్పటికీ, సెమీస్‌లో బాంగ్లాదేశ్ లేదా చైనా విజేతతో ఆడే ఛాన్స్ ఉండటంతో భారత్‌కు కాస్త గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా స్వర్ణ పతక రేసులో స్ట్రాంగ్ పోటీ ఇవ్వనున్నాయి.
క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్:
* భారత్ వర్సెస్ జపాన్
* బంగ్లాదేశ్ వర్సెస్ చైనా
* శ్రీలంక వర్సెస్ మలేషియా
* పాకిస్తాన్ వర్సెస్ థాయిలాండ్
సెమీఫైనల్స్ కాంబినేషన్స్:
* భారత్/జపాన్ విజేత వర్సెస్ బంగ్లాదేశ్/చైనా విజేత
* శ్రీలంక/మలేషియా విజేత వర్సెస్ పాకిస్తాన్/థాయిలాండ్ విజేత
క్వార్టర్స్‌కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన మెన్స్ క్రికెట్ టీమ్:
పురుషుల టోర్నమెంట్ కాస్త భిన్నమైన ఫార్మాట్‌లో జరగనుంది. ర్యాంకింగ్స్ ఆధారంగా ఏషియన్ ఖండంలోని ప్రధాన జట్లయిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు క్వార్టర్ ఫైనల్ స్థానాల కోసం ఆరు జట్లు ప్రిలిమినరీ గ్రూప్ స్టేజ్ దశలో పోటీపడనున్నాయి. అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ స్టేజ్ నుంచి మ్యాచ్‌లు ఆడాల్సి రావడం గమనార్హం.
గ్రూప్ దశ కూర్పు:
* గ్రూప్ ఎ: ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్
* గ్రూప్ బి: హాంకాంగ్ చైనా, మలేషియా, ఒమన్
క్వార్టర్ ఫైనల్స్:
* భారత్ వర్సెస్ (గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చే జట్టు)
* పాకిస్తాన్ వర్సెస్ (గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చే జట్టు)
* శ్రీలంక వర్సెస్ (గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చే జట్టు)
* బంగ్లాదేశ్ వర్సెస్ (గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చే జట్టు)
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:
భారత మెన్స్ క్రికెట్ జట్టు 2023 హాంజౌలో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉండగా, మహిళల జట్టు కూడా సరికొత్త ప్రణాళికలతో మరోసారి పసిడి సాధించాలని భావిస్తోంది. ఈ ఆసియా క్రీడలు 2026 క్రికెట్ మ్యాచ్‌ల అధికారిక ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) దక్కించుకుంది. మొబైల్ యూజర్లు, ఆన్‌లైన్ ప్రేక్షకులు సోనీలివ్ (SonyLIV) యాప్ ద్వారా ఈ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌లో చూడోచ్చు.
🚨Draw for Men's and Women's cricket at Asian Games
— RevSportz Global (@RevSportzGlobal) July 23, 2026
📸 Asian Games Insta #AsianGames pic.twitter.com/U5hC50qmpd
