సైబర్ నేరగాళ్ల అడ్డమైన పనులకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న హ్యాకర్లు..తాజాగా పోలీసులను టార్గెట్ చేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ పేజీను హ్యాక్ చేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి అందులో అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేశారు. మొత్తం నాలుగు వీడియోలను హ్యాకర్లు పోస్ట్ చేశారు. అన్ని వీడియోలు ఒకేసారి అప్‌లోడ్ చేసినట్లు కనిపిస్తోంది.
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారిక ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయింది. ఈ పేజీని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు..అందులో నగ్నవీడియాలను అప్‌లోడ్ చేశారు. విదేశాలకు చెందిన కొందరు మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలను ఈ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆసిఫ్ నగర్ పోలీసులు..సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికి కూడా ఫేస్ బుక్ పేజీలో వీడియోలు డిలీట్ కాకపోవడం గమనార్హం.
Also Read : చెరువుల పండుగ ఎట్లా చెయ్యాలే.. సర్పంచులు నిరసన
పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్లో కీ ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్ చేశారు. హ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్న కోణంలో సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు. జూన్ 8వ తేదీ అర్థ రాత్రి తర్వాత ఫేస్‌బుక్ పేజీ హ్యాక్‌కి గురైనట్లు అధికారులు గుర్తించారు. అయితే కొన్ని రోజులగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ పేజీ యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈ పేజీ నుంచి చివరి పోస్ట్ డిసెంబర్‌లో జరిగింది.

