వైఎస్ఆర్ ముఖ్య అనుచరుడు సూరీడు మీద హత్యాయత్నం

V6 Velugu Posted on Mar 24, 2021

మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు సూరీడు మీద హత్యాయత్నం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అతని నివాసంలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్‌తో దాడిచేశాడు. ఈ దాడి చేసిందో ఎవరో కాదు.. స్వయానా ఆయన అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డి. గతేడాది కూడా సురేంద్రనాథ్ రెడ్డి సూరీడు మీద దాడి చేశాడు. సురేంద్రనాథ్ రెడ్డి తన భార్య గంగా భవానీని వేధింపులకు గురిచేసేవాడు. దాంతో ఆమె తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. ఆ కేసులను ఉపసంహరించుకోకపోవడంతో కక్ష్య పెంచుకున్న సురేంద్రనాథ్ రెడ్డి.. మామ సూరీడు మీద కోపం పెంచుకున్నాడు. దాంతో మామను హత్య చేయాలని భావించి.. బుధవారం సూరీడు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. సూరీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. సురేంద్రనాథ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Tagged Hyderabad, andhrapradesh, YS Rajashekar Reddy, Jubilee Hills, Murder attempt

Latest Videos

Subscribe Now

More News