గైడ్ లైన్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు.. మీడియా పాయింట్ క్లోజ్..

గైడ్ లైన్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు.. మీడియా పాయింట్ క్లోజ్..

హైదరాబాద్: కరోనా నేపధ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని.. పార్లమెంటు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే సమావేశాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ హాల్ వద్ద అధికారులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారు.  అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నామని… సీఎస్ ఆధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామన్నారు.

అసెంబ్లీ ఆవరణలో కరోనా టెస్టులు

ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి అసెంబ్లీ ఆవరణలో కరోనా  టెస్టులు చేయడం ప్రారంభిస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తామన్నారు. ఎమ్మెల్యే లు బయట చేయించుకున్నా సరే.. నెగటివ్ రిపోర్ట్ చూపిస్తెనే అసెంబ్లీలోకి అనుమతిస్తామన్నారు. లాబీల్లోకి, మంత్రుల ఛాంబర్ లోకి మీడియా ప్రతినిధులకు  అనుమతి లేదన్నారు. గ్యాలరి లోకి మాత్రమే మీడియా అనుమతించే అవకాశం ఉందన్నారు.

అసెంబ్లీలో మీడియా పాయింట్ క్లోజ్..

కరోనా నేపధ్యంలో సోషల్ డిస్టెన్స్ అమలయ్యేలా చేస్తామని.. మీడియా పాయింట్ ను కూడా ఎత్తి వేస్తున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ, మండలి హాల్ లో 6 అడుగుల దూరం వచ్చే విదంగా సీట్లు ఏర్పాటు చేసామని.. శాసనసభ లో కొత్తగా 40 సీట్లు, కౌన్సిల్ లో 8 ఏర్పాటు చేసామన్నారు. కొరొనా కట్టడి విషయములో సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని.. ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ హాస్పిటల్స్ లలో రికవరీ రేట్ ఎక్కువగా ఉందన్నారు. అసెంబ్లీ కి వచ్చే ప్రభుత్వ అధికారులకు,  సిబ్బందికి కరొనా టెస్టులు చేయిస్తామని.. శాఖల వారిగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీపీఈ కిట్లుచ  ర్యాపిడ్ కిట్లుచ ఆక్సిమిటర్లు, అంబులెన్స్ లు అసెంబ్లీ లో  రెండు, శాసనమండలిలో మరో రెండు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ స్టాఫ్ మార్షల్స్ తో సహా సిబ్బంది అందరూ రెండు రోజుల ముందే టెస్టులు చేయించుకోవాలి. అసెంబ్లీ సెక్రెటరీ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు  కూడా కరోనా టెస్టులు చేయిస్తామన్నారు. అలాగే జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ , అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ప్రతి రోజు శానిటేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో రెగ్యులర్ ఉండే వైద్యులతో పాటు కరోనా పై అవగాహన ఉన్న వైద్యులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  శాసనసభ లోకి మంత్రులు, వారి పీఏలు.. అలాగే ఎమ్మెల్యేలు వారి పీఏలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.