4 నెలల్లో యూనివర్సిటీల్లో ఖాళీలు నింపాల్సిందే.. సుప్రీం తీర్పుతో రాష్ట్రాలకు కేంద్రం లేఖ

4 నెలల్లో యూనివర్సిటీల్లో ఖాళీలు  నింపాల్సిందే.. సుప్రీం తీర్పుతో రాష్ట్రాలకు కేంద్రం లేఖ
  • 4 నెలల్లో పోస్టులన్నీ  భర్తీ చేయాలి
  • సుప్రీంకోర్టు డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ
  • స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,125 టీచింగ్ పోస్టులు ఖాళీ
  • కాంట్రాక్ట్, పార్ట్ టైమ్​ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న  ఓయూ సహా అన్ని వర్సిటీలు 
  • స్టేట్ వర్సిటీల బాధ్యత రాష్ట్రాలదేనని తేల్చి చెప్పిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఏండ్ల తరబడి వర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. సర్కారుతోపాటు ప్రైవేటు వర్సిటీల్లోనూ ఫ్యాకల్టీ ఖాళీలను కేవలం 4  నెలల్లోగా భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వర్సిటీల్లో ఖాళీల భర్తీపై చర్చ మొదలైంది. తెలంగాణలోని 11 గవర్నమెంట్ వర్సిటీల్లో 2,878 పోస్టులకుగానూ 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. 

గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో పోస్టులను నింపుతామంటూ కొంత హడావుడి చేసినా.. వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. వర్సిటీల్లో ప్రొఫెసర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోని ఖాళీలను కేవలం 4  నెలల్లోగా భర్తీ చేయాలని ఆర్టికల్ 142 కింద  ఆదేశాలు జారీ చేసింది. 

జనవరి 15న వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు కాపీలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ఉన్నత విద్యా సంస్థలకు, రెగ్యులేటరీ బాడీలకు పంపామని కేంద్ర విద్యాశాఖ వారం క్రితం లోక్‌సభలో వెల్లడించింది. దీంతో తెలంగాణలోని యూనివర్సిటీల్లో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సెంట్రల్ వర్సిటీల్లో ‘సీయూ చయాన్’​తో..
కేంద్రం తన పరిధిలోని సంస్థల్లో ‘మిషన్ మోడ్’ పెట్టి వేల పోస్టులు భర్తీ చేస్తున్నది. 2025 అక్టోబర్ నాటికి సెంట్రల్ వర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో మొత్తం 29,979 పోస్టులు భర్తీ చేశామని, ఇందులో 17,494 ఫ్యాకల్టీ పోస్టులే ఉన్నాయని ప్రకటించింది. నియామకాల్లో పారదర్శకత కోసం ‘సీయూ -చయన్‌’ పోర్టల్ తెచ్చామని తెలిపింది. అయితే, రాష్ట్ర యూనివర్సిటీల భర్తీ ప్రక్రియ తమ పరిధిలోకి రాదని, అక్కడ ఖాళీలను ఆయా స్టేట్ గవర్నమెంట్లదేనని  కేంద్రం వెల్లడించింది. మిగిలిన ఖాళీలనూ భర్తీ చేస్తామని పేర్కొన్నది. దీంతో తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ వర్సిటీ, ఇఫ్లూ, సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ, ఐఐటీహెచ్‌లోనూ ఖాళీలను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ​

రిక్రూట్‌మెంట్‌ ఫైల్ ఎక్కడ ? 
వర్సిటీల్లో నియామకాల ఫైల్ ప్రస్తుతం ఎక్కడుందనే దానిపై విద్యాశాఖ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తున్నది. వర్సిటీల నుంచి ఖాళీల డేటా విద్యాశాఖకు చేరి చాలా రోజులయింది. వర్సిటీల పాలకమండలి సమావేశాల్లోనూ ఆమోదం లభించింది. ఆఖరికి ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందని ఉన్నతాధికారులు గతంలోనే ప్రకటించారు. కానీ, ఇంతవరకు నోటిఫికేషన్‌కు మాత్రం మోక్షం కలగలేదు. పోస్టుల భర్తీ ఎప్పుడని వీసీలు అడిగినప్పుడల్లా ‘ఫైల్ ప్రస్తుతం సీఎం పేషీలో ఉంది.. సంతకం కాగానే వచ్చేస్తుంది’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ప్రతీ మీటింగ్‌లోనూ చెప్తూ వస్తున్నారు. అయితే, వాస్తవానికి ఆ ఫైల్ సీఎంవోకు చేరిందా? లేదా ఇంకా విద్యాశాఖలోనే ఉందా? అనే విషయంలో మాత్రం స్పష్టత కరువైంది.

7  వర్సిటీల్లో ప్రొఫెసర్లే కరువు..
తెలంగాణలోని యూనివర్సిటీల్లో 13 ఏండ్లుగా రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో భారీగా ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలుగు వర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఆర్జీయూకేటీల్లో ఒక్క రెగ్యులర్​ ప్రొఫెసర్ కూడా లేరు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన, నిర్మల్ జిల్లాలోని ఆర్టీయూకేటీలో  ప్రొఫెసర్లే కాదు.. చివరికి అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఒక్కరూ లేరు. రెగ్యులర్ ఫ్యాకల్టీ తెలుగు యూనివర్సిటీ, పాలమూరు, జేఎన్ఏఎఫ్ఏయూలో 20లోపే ఉండటం ఆందోళన కల్గించే అంశం. అయితే, పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కారు కొంత ప్రయత్నం చేసినా.. నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ కాలేదు.