పిల్లలు పుట్టడం లేదని మిషన్​ భగీరథ అసిస్టెంట్​ ఇంజినీర్​ సూసైడ్

పిల్లలు పుట్టడం లేదని మిషన్​ భగీరథ అసిస్టెంట్​ ఇంజినీర్​ సూసైడ్

మహబూబ్​నగర్ రూరల్, వెలుగు:  సంతానం కలగడం లేదని మనస్తాపం చెంది మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజినీర్ చెన్నారపు భరత్ కుమార్(37) మంగళవారం మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం మార్లు కాలనీలోని తన ఇంటిలో ఉరేసుకున్నారు. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..  మహబూబ్​నగర్ టీచర్స్ కాలనీకి చెందిన చెన్నారపు భరత్ కుమార్ మిడ్జిల్ మండలంలో ఉద్యోగం చేస్తున్నారు. చాలాకాలంగా సంతానం కలగకపోవడం వల్ల భార్యాభర్తలకు మనస్పర్థలు ఏర్పడి విడాకులు తీసుకున్నారు. 

నాలుగు సంవత్సరాల కింద హైదరాబాద్​కు చెందిన అమ్మాయితో రెండో పెండ్లి జరిగింది. పిల్లలు పుట్టడం లేదని దవాఖానాల చుట్టూ తిరిగారు. పిల్లలు పుట్టరని మనస్తాపం చెంది భరత్ సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్నారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.